హై బీపీ ఉన్నవారు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా..?

పల్లీలు( Peanuts )వీటిని వేరుశెనగలు అని కూడా అంటారు.పులిహోర, చట్నీ, తాలింపుల్లో వీటిని విరివిరిగా వాడుతుంటారు.

 Do You Know What Happens If People With High Bp Eat Peanuts? Peanuts, High Bp, B-TeluguStop.com

అలాగే పల్లీలతో లడ్డూలు తయారు చేస్తుంటారు.కొందరు పల్లీలను వేయించి బెల్లంతో కలిపి కూడా తింటారు.

పల్లీల్లో ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐర‌న్‌, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, విటమిన్ బి, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా పల్లీలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా హై బీపీ ఉన్న వారికి పల్లీలు ఒక వరం అనే చెప్పుకోవాలి.అవును, పల్లీలకు అధిక రక్తపోటును అదుపులోకి తెచ్చే సామర్థ్యం ఉంది.

రోజు నైట్ నిద్రించే ముందు రెండు స్పూన్లు పల్లీలను బౌల్ లో వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఆ పల్లీలను తీసుకుని తినాలి.ఇలా రోజు చేస్తే అధిక రక్తపోటు అన్న మాటే అనరు

Telugu Pressure, Tips, Bp, Latest, Peanuts-Telugu Health

పల్లీల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం హై బీపీని కంట్రోల్ లోకి తేవడానికి అద్భుతంగా సహాయపడతాయి.అంతేకాదు  నైట్ అంతా నానబెట్టిన పల్లీలను ఉదయం తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్( Bad cholesterol ) కరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.అలాగే పల్లీలు నిత్యం మితంగా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.బ్రెయిన్ షార్ప్ అవుతుంది.కంటి చూపు మెరుగుప‌డుతుంది.

Telugu Pressure, Tips, Bp, Latest, Peanuts-Telugu Health

అంతేకాదు, వేయించిన  వేరుశెనగలు బెల్లం తో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.మరియు నీరసం అలసట వేధించకుండా ఉంటాయి.అయితే మంచిది కదా అని అతిగా మాత్రం పల్లీలను తినకూడదు.అలా చేస్తే కడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు( Digestive problems ) వంటి త‌లెత్తాయి.

కొంద‌రిలో స్కిన్ ర్యాషెస్ వ‌స్తాయి.అందుకే ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఆహార‌మైనా మింతంగానే తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube