హై బీపీ ఉన్నవారు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా..?

హై బీపీ ఉన్నవారు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా?

పల్లీలు( Peanuts )వీటిని వేరుశెనగలు అని కూడా అంటారు.పులిహోర, చట్నీ, తాలింపుల్లో వీటిని విరివిరిగా వాడుతుంటారు.

హై బీపీ ఉన్నవారు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా?

అలాగే పల్లీలతో లడ్డూలు తయారు చేస్తుంటారు.కొందరు పల్లీలను వేయించి బెల్లంతో కలిపి కూడా తింటారు.

హై బీపీ ఉన్నవారు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా?

పల్లీల్లో ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐర‌న్‌, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, విటమిన్ బి, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

ఆరోగ్యపరంగా పల్లీలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా హై బీపీ ఉన్న వారికి పల్లీలు ఒక వరం అనే చెప్పుకోవాలి.

అవును, పల్లీలకు అధిక రక్తపోటును అదుపులోకి తెచ్చే సామర్థ్యం ఉంది.రోజు నైట్ నిద్రించే ముందు రెండు స్పూన్లు పల్లీలను బౌల్ లో వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఆ పల్లీలను తీసుకుని తినాలి.ఇలా రోజు చేస్తే అధిక రక్తపోటు అన్న మాటే అనరు """/" / పల్లీల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం హై బీపీని కంట్రోల్ లోకి తేవడానికి అద్భుతంగా సహాయపడతాయి.

అంతేకాదు  నైట్ అంతా నానబెట్టిన పల్లీలను ఉదయం తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.

బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్( Bad Cholesterol ) కరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

అలాగే పల్లీలు నిత్యం మితంగా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.బ్రెయిన్ షార్ప్ అవుతుంది.

కంటి చూపు మెరుగుప‌డుతుంది. """/" / అంతేకాదు, వేయించిన  వేరుశెనగలు బెల్లం తో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

మరియు నీరసం అలసట వేధించకుండా ఉంటాయి.అయితే మంచిది కదా అని అతిగా మాత్రం పల్లీలను తినకూడదు.

అలా చేస్తే కడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు( Digestive Problems ) వంటి త‌లెత్తాయి.

కొంద‌రిలో స్కిన్ ర్యాషెస్ వ‌స్తాయి.అందుకే ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఆహార‌మైనా మింతంగానే తీసుకోవాలి.

సర్జరీ చేయించుకున్న యాంకర్ ప్రదీప్… అందుకే గ్యాప్ ఇచ్చారా.. ఏమైందంటే?

సర్జరీ చేయించుకున్న యాంకర్ ప్రదీప్… అందుకే గ్యాప్ ఇచ్చారా.. ఏమైందంటే?