ప్రస్తుత ఈ వర్షాకాలంలో జలుబు( Cold ) అనేది వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందర్నీ కామన్ గా వేధించే సమస్య.అయితే జలుబు చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తుంది.
జలుబు వల్ల ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంటుంది.రాత్రుళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
అలాగే దగ్గు, తలనొప్పి వంటివి జలుబుకు తోడైతే.ఇక వారి బాధ వర్ణనాతీతం.
అయితే జలుబు తగ్గడానికి మందులు వాడుతూ ఉంటారు.కానీ కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా జలుబును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

ముఖ్యంగా అందుకు ఆవనూనె ( Mustard oil )అద్భుతంగా సహాయపడుతుంది.జలుబును ఒక్క నైట్ లోనే ఆవనూనె తరిమి కొట్టగలదు.ఆవ నూనెలో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.అందువల్ల ఆవనూనెకు అన్ని రకాల సూక్ష్మజీవులను తొలగించే సామర్థ్యం ఉంది.అలాగే జలుబు సమస్యతో బాధపడుతున్న వారికి ఆవనూనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది.మరి ఇంతకీ ఆవనూనెను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆవ నూనె వేసుకోవాలి.అలాగే నాలుగు లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వాము( Ajwain ) మరియు వన్ టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి ముక్కలు( Garlic ) వేసి బాగా మిక్స్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టుకుని చిన్న మంటపై ఉడికించాలి.దాదాపు ఆరు నిమిషాల పాటు ఆయిల్ ను హీట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ ఆయిల్ గోరు వెచ్చగా అయిన తరువాత ఛాతీ మరియు పాదాలకు అప్లై చేసుకుని దాదాపు పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఇలా కనుక చేస్తే ఆల్మోస్ట్ ఒక్క నైట్ లోనే జలుబు సమస్య దూరం అవుతుంది.
ముక్కు కారడం, ఊపిరి సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు పరార్ అవుతాయి.ఒకవేళ ఇంకా కొంచెం జలుబు కనుక ఉంటే రెండు మూడు రోజులు ఈ ఆయిల్ ను అప్లై చేసుకోండి.
తద్వారా జలుబు సమస్య పూర్తిగా నయం అవుతుంది.