అధిక బ‌రువు నుంచి రక్తహీనత వరకు ఎన్నిటికో చెక్ పెట్టే సూపర్ డ్రింక్ మీకోసం!

ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అలాగే రక్తహీనత సమస్య సైతం చాలా మందిని వేధిస్తోంది.

 Consuming This Drink Will Prevent Anemia And Excess Weight! Anemia, Weight Loss,-TeluguStop.com

వీటి నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ డైట్ లో కనుక చేర్చుకుంటే అధిక బరువు నుంచి రక్తహీనత వరకు ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మరి ఇంతకీ ఆ సూపర్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

అలాగే మరో గిన్నెలో పది బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న నువ్వులను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే నానబెట్టి పొట్టు తొల‌గించిన బాదంపప్పులు, కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ప్ర‌స్తుత చ‌లికాలంలో ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఈ డ్రింక్ ను తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి చాలా త్వరగా బయటపడతారు.

అలాగే అతి ఆకలి దూరమవుతుంది.మెటబాలిజం రేటు రెట్టింపు అవుతుంది.దీంతో వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా మారుతుంది.చల్లని తట్టుకునే శక్తి లభిస్తుంది.మెదడు పనితీరు మునుపటి కంటే చురుగ్గా, వేగంగా పనిచేస్తుంది.

జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.

మరియు ఎముకలు, కండరాలు దృఢంగా సైతం మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube