కైకాల సత్యనారాయణకు కేజిఎఫ్ సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు తనకు నివాళులు అర్పించారు.

 Kaikala Satyanarayana Relation With Kgf Movie Details, Kaikala Satyanarayana ,-TeluguStop.com

ఇకపోతే కైకాల సత్యనారాయణ హీరోగా విలక్షణ నటుడిగా నిర్మాతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో సుమారు 700కు పైగా సినిమాలలో నటించిన కైకాల తుది శ్వాస విడిచారు.

శుక్రవారం తెల్లవారుజామున మరణించిన ఈయన అంత్యక్రియలను నేడు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఈ విధంగా కైకాల మరణించడంతో ఎంతోమంది ఆయన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ క్రమంలోనే తాజాగా కన్నడ హీరో యశ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాకు కైకాల సత్యనారాయణకు ఓ సంబంధం ఉంది.అయితే ఆ సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే….

కేజిఎఫ్ చిత్రాన్ని సాయి కొర్రపాటి, హోంబలే మేకర్స్ విజయ్ కిరంగదూర్ లతోపాటు.కైకాల సత్యనారాయణ కుమారుడు కలిసి నిర్మించారు.ఇలా కైకాల సత్యనారాయణ కుమారుడు కన్నడంలో ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమా తెలుగు హక్కులను కూడా కొనుగోలు చేసి తెలుగులో విడుదల చేశారు.ఇక కే జి ఎఫ్ సినిమా విడుదల సమయంలో చిత్ర బృందం కైకాల సత్యనారాయణకు సన్మానం కూడా చేసిన విషయం తెలిసిందే.

అలాగే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమాకి కూడా కైకాల కుమారుడు సహనిర్మాతగా వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube