డ్రై హెయిర్.( Dry hair ) చాలా మందిని కలవరపెట్టే సమస్య ఇది.రెగ్యులర్ గా తలస్నానం చేయడం, పోషకాల కొరత, వాతావరణంలో వచ్చే మార్పులు, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టు ఎండు గడ్డిలా మారుతుంటుంది.ఈ సమస్యను వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.
మళ్ళీ జుట్టును సిల్కీగా షైనీగా మెరిపించుకోవడం కోసం ఆరాటపడుతుంటారు.కొందరు సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.
మరికొందరు అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేక సతమతం అవుతుంటారు.
అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.ఈ రెమెడీతో ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్ ను పొందవచ్చు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు బటర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) అర కప్పు బియ్యం కడిగిన వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే డ్రై హెయిర్ అన్న మాట అనరు.
ఈ రెమెడీ ఎండు గడ్డిలా ఉన్న మీ జుట్టును స్మూత్ గా సిల్కీగా మారుస్తుంది.కురులు షైన్ అవుతాయి.
అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్( Hair fall problem ) సమస్య తగ్గు ముఖం పడుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.దాంతో మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.డ్రై హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు జుట్టు రాలిపోతుందని సతమతం అవుతున్న వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.