అక్రిడిటేషన్ గడువు పొడిగించాలి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నూతనంగా జారీచేయనున్న అక్రిడిటేషన్ ధరఖాస్తుల తేదీలను మరో పది రోజులు పొడిగించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు.దరఖాస్తులు చేసుకునే జర్నలిస్టులకు ఆన్లైన్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.

 Accreditation Deadline Should Be Extended-TeluguStop.com

అదేవిధంగా జర్నలిజంలోకి కొత్తగా వచ్చిన వారు అప్లికేషన్ చేసుకునే విధానం తెలియక కాస్త ఇబ్బందులు పడుతున్నారని,ఇంకా పలు రకాల సమస్యలతో సతమతమవుతున్న కారణంగా దరఖాస్తుల గడువు మరో పది రోజులు పెంచాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సమాచార కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube