ప్రజారోగ్యాన్ని రక్షించాలి:మట్టిపెళ్లి

సూర్యాపేట జిల్లా: సీజనల్ వ్యాధుల మూలంగా ప్రజలు అంటు రోగాలు,విష జ్వరాల బారిన పడి తల్లడిల్లుతుoటే వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉంటున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ఆరోపించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల మూలంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు విష జ్వరాల బారినపడి తల్లడిల్లుతుoటే వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 Protect Public Health: Mattipelli-TeluguStop.com

వైరల్ ఫీవర్, టైఫాయిడ్,మలేరియా,చికెన్ గున్యా,డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలి ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జ్వర పీడితులుగా ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నారని,వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం,వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వైద్య బృందాలను ఏర్పాటు చేసి రోగులకు కావలసిన మందులు,వైద్య పరీక్షలు విస్తృతంగా చేపట్టాలని,వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రజలందరికీ యుద్ధప్రాతిపదికన వైద్య సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 24 గంటలు ప్రజలకు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని, జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు.ప్రభుత్వం నుండి ప్రజలకు వైద్య సహాయం అందక పోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని,దీని మూలంగా పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే సంచార వైద్య బృందాల ద్వారా ప్రజలందరికీ వైద్యం అందించాలని లేనియెడల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ విలేకర్ల సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,జిల్లా సహాయ కార్యదర్శి నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube