అక్రిడిటేషన్ గడువు పొడిగించాలి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నూతనంగా జారీచేయనున్న అక్రిడిటేషన్ ధరఖాస్తుల తేదీలను మరో పది రోజులు పొడిగించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు.
దరఖాస్తులు చేసుకునే జర్నలిస్టులకు ఆన్లైన్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.అదేవిధంగా జర్నలిజంలోకి కొత్తగా వచ్చిన వారు అప్లికేషన్ చేసుకునే విధానం తెలియక కాస్త ఇబ్బందులు పడుతున్నారని,ఇంకా పలు రకాల సమస్యలతో సతమతమవుతున్న కారణంగా దరఖాస్తుల గడువు మరో పది రోజులు పెంచాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సమాచార కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు.
ఒకేసారి ఆలయానికి, గురుద్వారాకి .. వైవిధ్యం చాటుకున్న ఆస్ట్రేలియా ప్రధాని