సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ (సద్దల చెరువు) కట్టపైకి వాహనాలకు అనుమతి లేదని పట్టణ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో బారికెడ్స్ ఏర్పాటు చేశారు.అనంతరం సిఐ మాట్లాడుతూ ప్రజల విహార,వినోదం కోసం ఏర్పాటు చేసిన సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ పైకి వాహనాలకు అనుమతి లేదన్నారు.
పాదచారులకు ఎలాంటి ఇబ్బందీ కలిగొంచవద్దని కోరారు.అలాగే అర్ధరాత్రి కట్టపై యువత,ఆకతాయిలు పార్టీలు,కేక్ కటింగ్ లాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు కట్టపైకి వస్తే సీజ్ చేయడం జరుగుతుందన్నారు.ట్యాంక్ బండ్ పరిసరాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.