దళితుల జీవితాల్లో నూతన వెలుగులు

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వాల హయాంలో అణిచివేయబడ్డ దళితుల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు యూనిట్లను శనివారం రాత్రి పట్టణంలోని 25,37, 45వ వార్డుల్లో సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తో కలసి ప్రారంభించారు.

 New Lights In The Lives Of Dalits-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు.నేడు దళితబంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలిత ,25 వ వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత,45 వ వార్డు గండూరి పావనికృపాకర్,17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుశ,గండూరి కృపాకర్, ఉప్పల ఆనంద్,పిడమర్తి శంకర్,దుర్గాప్రసాద్, ఉట్కూరు సైదులు,మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ రియాజ్,మహిళా నాయకురాలు కరుణశ్రీ,సల్మా మస్తాన్,దండు రేణుక,విజయ,మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube