అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను ఆకాశానికి ఎత్తి పొగిడేస్తూ,మిగతా సమయాల్లో మహిళల ఆరోగ్యం విషయంలో పాతాళానికి తొక్కేస్తున్నారని విన్నపం ఒక పోరాటం స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు.గురువారం ఆమె హుజూర్ నగర్ పట్టణంలో మహిళల సమక్షంలో వివిధ కంపెనీలకు చెందిన ప్యాడ్స్ ని చూపిస్తూ ప్రతి ఒక్కరూ ఆలోచించండి,నేనేమీ డబ్బుల కోసం వీటిని పట్టుకొని టీవీలో యాడ్ ఇవ్వట్లేదని వాటి వలన అనర్థాలను వివరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ పీరియడ్స్ సమయంలో వాడే సానిటరీ నాప్కిన్స్ ని కార్పోరేట్ కంపెనీలు హానికర కెమికల్స్ తో తయారు చేస్తున్నాయని, ఈ విషయం ప్రభుత్వాలకు తెలిసిన ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.ఆ కంపెనీలని తక్షణమే బ్యాన్ చేసి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కెమికల్స్ రహిత సానిటరీ నాప్కిన్స్ ని ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు.
అప్పుడే మహిళల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావిస్తామనిఅన్నారు.ప్రతి ఇంట్లో ఉండే స్త్రీలు అనారోగ్యం పాలు కావద్దనే మా ప్రయత్నమని ప్రతి ఒక్కరి ఈ విషయంపై స్పందించాలని కోరారు.