అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా:అత్తింటి వేధింపులకు మరో మహిళ బలైంది.ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని,ఆదనవు కట్నం తీసుకురావాలని భర్త,అత్త నిత్యం చేసే వేధింపులకు తాళలేక జిల్లా కేంద్రంలోని బ్యాంకు ఉద్యోగి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 Wife Commits Suicide Due To Abuse Of Daughter-in-law-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా గాజులంక గ్రామానికి చెందిన సనక శ్రీకాంత్, అదే గ్రామానికి చెందిన వాసవితో నాలుగేళ్ళ క్రితం వివాహం జరిగింది.వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నారు.ఇద్దరు ఆడపిల్లలు పుట్టడానికి భార్యే కారణమని భావించి కొంతకాలంగా భర్త శ్రీకాంత్,అత్త రమాదేవి వేధిస్తూ, అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో మానసిక క్షోభకు గురైన వాసవి సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది.

మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube