ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రూపు-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాల్లో ఈ నెల 27 న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు,జూన్ 9 న జరిగే గ్రూపు -1 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ( S.

 Strong Arrangements For Mlc Elections, Group-1 Exams, Collector ,mlc Elections-TeluguStop.com

Venkata Rao )అన్నారు.జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde),జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సిహెచ్.

ప్రియాంకతో కలిసి ఆయన ఆర్డీవోలు,జిల్లా అధికారులు,నోడల్ అధికారులు,తహాశీల్దార్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

శాసనమండలి ఎన్నికలకు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు 142 జంబో బ్యాలెట్ బాక్సులు శ్రీ సత్యసాయి జిల్లా నుండి తెప్పించడం జరుగుతుందన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల గాను సూర్యాపేటలో 31 పోలింగ్ కేంద్రాలు, కోదాడలో 22 పోలింగ్ కేంద్రాలు,హుజూర్ నగర్ లో 18 పోలింగ్ కేంద్రాలు మొత్తం 71 పోలింగ్ కేంద్రాలలో అని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో మొత్తం 51,497 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.(ఎఫ్ఎస్టీ) ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లచే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.

అలాగే జూన్ 9వ తేదీన జరిగే గ్రూప్-1 పరీక్షలకు జిల్లాలో 40 సెంటర్లలలొ నిర్వహించనున్నట్లు,దీనికి 9,744 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ తెలిపారు.

వీరికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లాలో జరిగే గ్రూప్ -1 పరీక్షలకు అన్ని కేంద్రాలలో బందోబస్తుకు పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని,అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, ఆర్టీసీ,విద్యుత్ శాఖ,రోడ్లు భవనాల శాఖ,తమ పూర్తి సహకారం అందించాలన్నారు.పట్టభద్రుల ఎన్నికల్లో( MLC elections ) ఎఫ్ఎస్టిలు పనిచేస్తాయని,ఈ ఎన్నికలకు జిల్లా ఫోర్స్ నే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ వివి అప్పారావు, బ్యాలెట్ బాక్సెస్ నోడల్ ఆఫీసర్ డిపిఓ సురేష్ కుమార్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి,పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ మత్స్య శాఖ అధికారి రూపేందర్ సింగ్,వెహికల్, ట్రాన్స్పోర్ట్ నోడల్ అధికారి ఆర్టిఓ సురేష్ రెడ్డి,ఎంసీసీ నోడల్ ఆఫీసర్ డిఎఫ్ఓ వి సతీష్ కుమార్,ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ ఎస్ పద్మ,ఎంసీఎంసీ నోడల్ ఆఫీసర్ డిపిఆర్ఓ ఏ.రమేష్ కుమార్,ఎలక్ట్రో రోల్స్ మోడల్ ఆఫీసర్ శ్యాంసుందర్ ప్రసాద్, అబ్జర్వేషన్ మోడల్ ఆఫీసర్ లక్ష్మణ నాయక్,పిడబ్ల్యుడి నోడల్ ఆఫీసర్ వెంకటరమణ, మాస్టర్ ట్రైనర్స్ వి రమేష్, వెంకటేశ్వర్లు,శ్రీనివాసరావు,ఎన్నికల సూపర్డెంట్ శ్రీనివాసరాజు,వేణు,రమేష్, గ్రూప్ వన్ పరీక్షల సూపరిండెంట్ పద్మారావు, కలెక్టరేట్ ఏవో మందాడి సుదర్శన్ రెడ్డి,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube