పట్టణంలో ఏపుగా పెరిగిన కంపచెట్లను తొలగించండి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాంపురం రోడ్ విద్యానగర్ కు వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన కంపచెట్ల నుండి తేళ్ళు,పాములు, విష పురుగులు ఇళ్లలోకి వచ్చి స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారని, అలాగే కంపచెట్లు విస్తారంగా పెరగడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని సిపిఐ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.లక్ష్మి అన్నారు.

 Remove Overgrown Campchets In Town , Campchets In Town, Aruna, Working President-TeluguStop.com

మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పట్టణ వాసులకు ఇబ్బందిగా మారిన కంపచెట్లను తొలగించే విధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.అలాగే కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు అఖిలపక్ష బృందంతో కలిసి అన్ని వార్డులు పరిశీలించి ఆయా వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరారు.

మహిళా సమాఖ్య నాయకురాళ్లు అరుణ, మంగమ్మతో కలిసి ఏపుగా పెరిగిన కంపచెట్లను ఆమె పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube