24.17 కోట్లతో నేరేడుచర్ల మున్సిపల్ అంచనా బడ్జెట్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయం( Nereducharla Municipal Office )లో గురువారం మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ అధ్యక్షతన సమావేశమైనపాలకవర్గం 2024-25 సవరించిన ఆర్థిక బడ్జెట్ అంచనాలు నిర్ణయించారు.కమిషనర్ వెంకటేశ్వర్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

 Nereducharla Municipal Estimated Budget Of Rs 24.17 Crore, Nereducharla Municipa-TeluguStop.com

ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు 2024-25 ప్రవేశపెట్టిన సంవత్సర ఆర్థిక బడ్జెట్ అంచనా, ఆదాయ వ్యయ వివరాలను తెలియపరిచారు.మొత్తం ఆదాయం 24.17 కోట్లు,మొత్తం వ్యయం 24.17 కోట్లు అంచనా ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు అందరూ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఆమోదించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్( Bachchalakuri Prakash ) మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు బడ్జెట్ రూపొందించామని,వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని ప్రతి వార్డుకు నీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని,ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పట్టణంలో డ్రైనేజీలు,వీధిలైట్లు,సీసీ రోడ్లు,ఏర్పాటు చేసి పురపాలక అభివృద్ధికి పాటుపడతామన్నారు.

ఒకటో వార్డ్ కౌన్సిలర్ కొనతం చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని,మిషన్ భగీరథ ( Mission Bhagiratha)నీటిని అందించే ప్రయత్నం చేస్తామన్నారు.పట్టణంలో అన్ని ట్యాంకులకు మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంప్రదిస్తామన్నారు.

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరంబదిలీపై వెళ్తున్న కమిషనర్నిలిగొండ వెంకటేశ్వర్లు పాలకవర్గం తరుపున సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube