యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గురువారం కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం( Dharmabhiksham ) జయంతి వేడుకలను గీత పనివారాల సంఘం యాదాద్రి జిల్లా కార్యదర్శి పందుల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మభిక్షం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడని,నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం పాటుపడిన నిస్వార్థ కమ్యునిస్టు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనికొనియాడారు.
ట్యాంకు బండ్( Tank bund ) పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గీతా పనివారల సంఘం అధ్యక్షుడు నీళ్ల గాలయ్య, కంఠమహేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షుడు రాపర్తి కరుణాకర్, మొగుదల సత్తయ్య, పాలకుర్ల యాదయ్య, వీరమల్ల యాదయ్య,నీళ్ల యాదయ్య,లింగస్వామి, ముత్యాలు,యాదయ్య, స్వామి,చంద్రయ్య, ఐటిపాముల అంజయ్య, పల్లె రాములు,రాములు, రాజు,రఘు తదితరులు పాల్గొన్నారు.