అక్క కుటుంబాన్ని హతమార్చేందుకు చెల్లి కుటుంబం కుట్ర

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.అక్కచెల్లెళ్ల ఆస్తి పంపకాల విషయంలో ఏర్పడిన వివాదంలో అక్క కుటుంబాన్ని ఖతం చేసే పనికి చెల్లి,ఆమె భర్త పూనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 Sister's Family Conspired To Kill Sister's Family-TeluguStop.com

బాధితుల, పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన బత్తిని కన్నయ్య భార్య రమాదేవికి గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం గ్రామంలో తన పుట్టింటి ద్వారా సంక్రమించిన భూమి ఉంది.అందులో నారు పోయడానికి గురువారం మధ్యాహ్నం బేతవోలు నుండి తాళ్లమల్కాపురం వెళ్లారు.

విషయం తెలుసుకున్న తాళ్ళ మల్కాపురం గ్రామానికి చెందిన రమాదేవి సొంత చెల్లి చెరుకు ఈశ్వరమ్మ భర్త చెరుకు రామకృష్ణ భూమి పంచాయితీని దృష్టిలో ఉంచుకుని వారిని హతమార్చేందుకు పథకం ప్రకారం మరికొంతమందిని వెంటేసుకొని ట్రాక్టర్ తో పొలం దగ్గరకు చేరుకున్నారు.చెరుకు రామకృష్ణ తన యొక్క AP24 AK 9013 నెంబర్ గల ట్రాక్టర్ తో రమాదేవి మరియు ఆమె భర్త బత్తిని కన్నయ్యను తొక్కించేందుకు ప్రయత్నం చేయగా వారు ట్రాక్టర్ దాడి నుండి తప్పించుకున్నారు.

కానీ,బత్తిని కన్నయ్యపైకి ట్రాక్టర్ ఎక్కడంతో ఆయన కుడి కాలు విరిగి ఛిద్రమై ప్రాణాలతో బయటపడ్డాడు.దీనితో చెరుకు రామకృష్ణ అతని భార్య ఈశ్వరమ్మ,వారితో వచ్చిన ఇతరులు అక్కడి నుండి పారిపోయారు.

తీవ్ర గాయాలతో పడిపోయిన బత్తిని కన్నయ్యను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.కన్నయ్య కుమారుడు బత్తిని హరీష్ ఫిర్యాదు మేరకు హత్యాయత్నానికి పాల్పడిన నేరస్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube