విద్యుత్ షాక్ తో రైతు మృతి

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం( Penpahad Mandal ) నారాయణగూడ గ్రామానికి చెందిన నారాయణ లింగారెడ్డి(55) విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.

 Farmer Died Due To Electric Shock-TeluguStop.com

మృతుడు లింగారెడ్డి గురువారం సాయంత్రం నాగులపహాడ్ లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్ ఆన్ చేయడానికి వెళ్లారు.

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ( Power transformer )కు ఆన్ ఆఫ్ స్విచ్ మరమ్మతులకు రావడంతో విద్యుత్ అధికారులు తీగలను మల్చి పైకి వేలాడేశారు.

ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసే రాడ్ హ్యాండ్ ని లాగడంతో పైన వేలాడిన ఆన్ ఆఫ్ స్విచ్ తీగలు తగిలి విద్యుత్ షాక్ తగిలి ట్రాన్స్ఫార్మర్ దిమ్మె,విద్యుత్తు స్తంభం మధ్యలో పడి మృతి చెందాడు.చీకటి పడినా ఇంటికిరాలేదని కుటుంబ సభ్యులు, రైతులు అక్కడికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube