Vanga Geeth : పిఠాపురంలో నాదే గెలుపు అంటున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత..!!

2024 ఎన్నికలలో పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.గురువారం తన పోటీ విషయాన్ని తెలియజేయడం జరిగింది.

 Ycp Candidate Vanga Geetha Claims Victory In Pithapuram-TeluguStop.com

ఈ క్రమంలో పిఠాపురం నుండి వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వంగా గీత( Vanga Geetha ) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.పిఠాపురం నుండి పవన్ పోటీ చేస్తే తన గెలుపు ఇంకా సులువు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.2019 ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఆమె గెలిచారు.కాగా ఇప్పుడు 2024 ఎన్నికలకు.

వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.ఇదే నియోజకవర్గము నుండి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పొటికి దిగుతున్నారు.2019 ఎన్నికలలో భీమవరం అదేవిధంగా గాజువాక నుండి పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఒక పార్టీ అధ్యక్షుడు పైగా సినీ గ్లామర్ ఉన్న గాని పవన్ ఓడిపోవడం చాలామందికి షాక్ కి గురి చేయడం జరిగింది.ఈ క్రమంలో 2024 ఎన్నికలకు( 2024 elections ) ఓడిపోయిన చోట నుండే పవన్ పోటీ చేస్తారని భావించారు.దీంతో భీమవరం నుండి ఆయన పోటీ ఉంటుందని భావించారు.

కానీ అనూహ్యంగా పిఠాపురం నుండి పవన్ పోటీకి దిగటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఎట్టి పరిస్థితులలో 2024 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

ఇదే సమయంలో వైసీపీ రెండోసారి అధికారంలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.దీంతో టీడీపీ, బీజేపీ( TDP, BJP ) పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube