బావిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి?

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో ఇరుగు చందు (13) తండ్రి ఇరుగు మల్సూర్ అనే బాలుడు మధ్యాహ్నము స్నేహితులతో కలిసి సరదాగా సంగెం శివారులో గల బావిలో ఈతకు వెళ్లాడు.కొద్దిసేపు ఈత కొట్టిన తర్వాత స్నేహితులందరూ బావినుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్దామని అనగా నేను ఇంకా కొద్దిసేపు ఈతకొట్టి వస్తానని స్నేహితులకు చెప్పాడని,ఇరుగు చందు పైకి రాకపోయేసరికి వెనక్కి వచ్చి చూసేసరికి లోపలికి మునిగినట్టుగా అనుమానించారు.

 Did The Boy Die After Swimming In The Well?-TeluguStop.com

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం 2 మోటర్లు పెట్టి నీటిని తోడుతున్నామని,నీరు చాలా ఎక్కువ ఉందని,బాడీ ఇంకా బయటపడలేదని,ఇట్టి సంఘటనపై మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ డానియల్ తెలిపారు.ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube