ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2 కోట్లకు పైగా యూజర్లు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్టు తాజా సర్వేలు చెబుతున్నాయి.వీరిలో ఎక్కువగా ఆండ్రాయిడ్ యూజర్లే వుండటం గమర్హం.
అందుకే టెక్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో భారీ మార్పులు చేసేందుకు ధైర్యం చేయలేకపోతుంది.భారీ చేంజెస్ చేసే క్రమంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే చాలామంది యూజర్ల ప్రభావితం అవుతారని ఇప్పటివరకు అత్యంత అవసరమైన చేంజెస్ మాత్రమే చేస్తూ వస్తోంది గాని అనవసరంగా ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వెర్సన్స్ మాత్రం తీసుకురావడంలేదు.
ఈ నేపథ్యంలో, తాజాగా గూగుల్ క్రోమ్ ట్యాబ్ పేజీ డిజైన్ మార్చేందుకు సిద్ధమయ్యింది.గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ బ్రౌజర్‌లో డిజైన్‌కు సంబంధించి భారీ మార్పులు రానున్నట్టు సమాచారం.
టెక్ రిపోర్ట్స్ ప్రకారం, గూగుల్ క్రోమ్ ట్యాబ్ పేజీ రూపం పూర్తిగా చేంజ్ అవుతోంది.ఈ కొత్త డిజైన్ ఇప్పటికే కొందరి యూజర్లకు అందుబాటులోకి రాగా త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో గూగుల్ క్రోమ్ కొత్త పేజీ ట్యాబ్‌లో గూగుల్ లోగో… సెర్చ్, URL ఎంట్రీ కోసం ఓమ్నిబాక్స్.ఇటీవల సందర్శించిన సైట్‌ల కోసం షార్ట్‌కట్‌లు ఉన్నాయి.
ఈ పేజీలో 4x 2 గ్రిడ్‌లో మొత్తం 8 వెబ్‌సైట్‌లు కనిపిస్తాయి.ఈ డిజైన్ ఏ ముఖ్యమైన అప్‌డేట్స్ లేకుండా ఏళ్లుగా అంతే ఉంది.
డిజైన్‌లో కొత్తగా ఎలాంటి అప్‌డేట్స్ తీసుకురాకపోతే యూజర్లకు క్రోమ్ పై నెగిటివ్ ఫీలింగ్ వస్తుందనే భావనతో గూగుల్ కొత్త డిజైన్ పరిచయం చేస్తున్నట్లు టెక్ తెలుపుతున్నాయి.







