సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని జిల్లా బాల్ భవన్ లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలతో గురువారం సెక్టోరియల్ అధికారులు దేవరశెట్టి జనార్ధన్,నూకల ప్రతాప్ సందర్శించి,అక్కడి పరిస్థితులను పర్వవేక్షించారు.బాల భవన్ చిన్నారులు తమ నైపుణ్యాలను మెరుగు పర్చుకునెందుకు వీలుగా వుందా లేదా,లేక ఏవైనా సౌకర్యాల,వసతుల కొరత వుందా అని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అన్ని విభాగాల వారీగా చిన్నారులు వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.తదనంతరం చిన్నారులను సమాచారం అడిగి అధికారులు తెలుసుకున్నారు.
తల్లిదండ్రులతో ముచ్చటించగా వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ బాలలకు బాల్ భవన్ ఏర్పాటుతో క్రమ శిక్షణ, మానవతా విలువలు అవగాహన కల్పించడం, సంస్కృతి,సాంప్రదాయాలు,కళలల్లో శిక్షణ అందించడం ముఖ్య ఉద్దేశ్యంగా పనిచేస్తున్నదని, తమ పిల్లల అదృష్టం బాల్ భవన్ అందుబాటులో వుండటమని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కి,జిల్లా విద్యాశాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.
తదనంతరం ప్రతి విభాగానికి వెళ్లి చిన్నారులతో మాట్లాడి అభినందించారు అధికారులు.ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడం విశేషం అని,అన్ని రంగాల్లో చిన్నారులు ఆరితేరాలని అన్నారు.
సిబ్బంది గురుంచి మాట్లాడుతూ చిన్నారులకు ఆసక్తికి తగినట్టుగా శిక్షణ ఇవ్వడం, ఎలాంటి ఇబ్బందీ లేకుండా సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి జాగ్రత్తలు పాటించడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో దాసరి యల్లయ్య,ఉమా,సత్యనారాయణ సింగ్, అనిల్,సాయి చరణ్,వీరు నాయుడు,పద్మ,సునీత, పేరెంట్స్,స్టూడెంట్స్ వున్నారు.