ప్రైవేట్ స్కూల్ విద్యార్ది అదృశ్యం దొరకబట్టిన పోలీసులు

సూర్యాపేట జిల్లా:మోతె మండలం మామిల్లగూడెం లోని శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ స్కూల్ లో 4 వ,తరగతి చదువుతున్న నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చింత కృపాకర్ కుమారుడు జైపాల్ (09) (J aipal )బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్టల్ నుండి తప్పిపోయాడు.ఈ విషయం సహచర విద్యార్థుల నుండి తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు,పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 The Police Found The Disappearance Of The Private School Student , Sri Venkates-TeluguStop.com

దీనితో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు.

పిల్లాడి కోసం వెతుకులాట ప్రారంభించిన మోతె( Mothey ) పోలీసులు గురువారం మధ్యాహ్నం మామిల్లగూడెం, హుస్సేనబాద్ గ్రామాల మధ్యలో దొరకబట్టి పేరెంట్స్ కి బాబుని అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

అయితే తమ కుమారుడు తప్పిపోయిన ఘటనపై పేరెంట్స్ మాట్లడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఫీజుల మీద ఉన్న శ్రద్ధ పిల్లల పర్యవేక్షణ మీద లేదని, హాస్టల్ లో ఉండే విద్యార్థులు బయటికి వెళ్లే పరిస్థితి ఎలా ఉంటుందనిఆగ్రహం వ్యక్తం చేశారు.ఏదీ ఏమైనా తమ బిడ్డ తమకు సురక్షితంగా అప్పగించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube