నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో భూసంబంధ వ్యవహారాల్లో ధరణి పోర్టల్ అవినీతికి కేరాఫ్ గా మారిందని, తక్షణమే ధరణిని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శుక్రవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…రాష్ట్రంలో ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న అన్యాయాలు అన్నీఇన్నీ కావని,నిజమైన భూ హక్కుదారులను ఇబ్బంది కలిగిస్తూ అవినీతికి మూలంగా మారిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.2018 ఎన్నికల్లో ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు హామీని కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని, వ్యవసాయానికి సరైన సమయానికి కరెంటు అందక,అప్రకటిత విద్యుత్ కోతలతో చాలా వరకు పంట పొలాలు ఎండిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.అలాగే ఉచిత ఎరువులు మరియు రైతులకు సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు ఇస్తానన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఎన్నికల హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కి అందజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్,రాష్ట్ర దళిత మోర్చ కార్యదర్శి పోతేపాక సాంబయ్య, రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు,కిషన్ మోర్చ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.