గత కొద్దిరోజులుగా తెలంగాణలోని ప్రధాన పార్టీలైన బి.ఆర్.
ఎస్, బిజెపి, కాంగ్రెస్ నాయకుల పైన విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇదేవిధంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోది విపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని, అందుకే ఈ విధంగా వేధింపులకు పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా బిజెపి అగ్ర నాయకులు నుంచి తెలంగాణ బిజెపి నాయకులు వరకు అందరిపైనా తనదైన శైలిలో కేటీఆర్ విమర్శలు చేశారు.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పైన, తెలంగాణ బిజెపి నాయకుల పైన కేటీఆర్ విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా ఇటీవల బీజేపీలో చేరి, హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన బిజెపి నేత, సీనియర్ పొలిటిషన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఉద్దేశించి పరోక్షంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ లో చేర్చుకునేందుకు మునుగోడులో ఒక వ్యక్తికి బిజెపి ప్రభుత్వం 18 వేల కోట్ల కాంట్రాక్టు ను ఆఫర్ గా ఇచ్చింది వాస్తవమా కాదా అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బిజెపి నేత ,
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పై విమర్శలు చేస్తూ సవాల్ విసిరారు.కేటీఆర్ కు నిజంగా విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తాను బిజెపిలో చేరినందుకు 18 వేల కోట్ల కాంట్రాక్టు పొందానని నిరూపించాలంటూ రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు.
కేటీఆర్ గ్లోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే అది తన విషయంలో పనిచేయదని గుర్తించుకోవాలి అంటూ రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.