కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

సూర్యాపేట జిల్లా:ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు.గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యు) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని,ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 57 లక్షల 17 వేల మందికి జాబ్ కార్డులు ఉండగా, కేవలం 36 లక్షల మందికే ప్రభుత్వం పని చూపిస్తన్నదని,మిగతా వారికి పనిలేదని గెంటి వేస్తున్నారని ఆరోపించారు.

 The Central And State Governments Have Failed-TeluguStop.com

వారికి చేతి నిండా పని దొరకాలంటే బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఎడబ్ల్యూ )జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి సైదులు మాట్లాడుతూ రెండుసార్లు ఫోటోలు ఆఫ్ లోడ్ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదన్నారు.

ఉపాధి కూలీలకు సమ్మర్ అలవెన్స్ ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ 333ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.వారంవారం ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా,అనేక వారాలుగా బకాయిలున్నాయి,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని గ్రామాల్లో పోస్టాఫీసు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

పని జరిగేచోట దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షలు చెల్లించాలని అన్నారు.మేట్స్,వాచర్స్ కు కూలీల డిమాండ్ కు అనుగుణంగా పనులు కల్పించి పారితోషికం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.పనిదినాలు 200 రోజులకు పెంచి రోజు కూలీ రూ.600 ఇవ్వాలన్నారు.కూలీలకు పనిముట్లు,మెడికల్ కిట్,టెంటు,త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.ప్లే స్లిప్,బ్లూ ఫామ్ స్లిప్ లు ఇవ్వాలని అన్నారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో శ్రీదేవికి సమర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, నారసాని వెంకటేశ్వర్లు,మిట్టపల్లి లక్ష్మి,రెమిడాల రాజు,ఎల్లంల యాదగిరి,చిలకరాజు శ్రీను,జడ వెంకన్న,గొడ్డేటి పవన్,తాళ్లూరి మల్లయ్య,పోరండ్ల మట్టయ్య,ఆరే రామకృష్ణారెడ్డి,మడ్డి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube