సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల ( Garidepally Mandal )కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నిఘా ఏర్పాటు చేయగా TS 04 UE0918 నెంబర్ గల అశోక్ లే లాండ్ వాహనం అనుమానాస్పదంగా కనిపించదని,ఆపి విచారిస్తుండగా డ్రైవర్ పరార్ అయ్యారని గరిడేపల్లి ఎస్ఐ ఈట సైదులు తెలిపారు.
30 క్వింటాల్ పీడీఎస్ బియ్యం( PDS rice ), వాహనాన్ని స్వాధీనం చేసుకొని,అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,పల్నాడు (నరసరావుపేట) జిల్లా, మాచర్ల మండలం, కంభంపాడు గ్రామానికి చెందిన కొండా కొండలు కుమారుడు కొండా గోపి(29) మరికొందరు కలిసి అక్రమంగా రేషన్ బియ్యం కొని రవాణా చేస్తున్నట్లు తెలిపారన్నారు.హుజూర్ నగర్ సిఐ చరమందరాజు పర్యవేక్షణలో కేసు నమోదు చేశామన్నారు.