నేరేడుచర్లలో వరుస దొంగతనాలు

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నేరేడుచర్ల పట్టణ ప్రజలు భయంతో హడలిపోతున్నారు.మంగళవారం రాత్రి పట్టణంలోని 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి 4 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే మరో ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 A Series Of Thefts In Nereducharla,thefts ,nereducharla, Suryapet District, Robb-TeluguStop.com

నేరేడుచర్లలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న పొట్టబత్తుల శంకరయ్య ఇంట్లో చోరీ జరిగిందని నేరేడుచర్ల ఎస్ఐ పరమేష్ తెలిపారు.

ఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం నేరేడుచర్ల ఎంపీడీవోగా శంకరయ్య ఆటోనగర్ కాలనీలో అంజలి స్కూల్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు.ఈనెల 18 ఉదయం తన సొంత పనిమీద నకిరేకల్ పట్టణం వెళ్లారు.20 వ తేదీ రాత్రి తన ఇంటి వద్దకు వచ్చేసరికి ఇంటి ప్రవేశ ద్వారం తాళం,తలుపు పగలగొట్టి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూసేసరికి ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి ఉందని,బెడ్ రూమ్ బీరువాలో బంగారపు నల్లపూసల గొలుసు 20 గ్రాములు,బంగారపు చెవి దిద్దులు 5 గ్రాములు,వెండి పట్టీలు 200గ్రాములు, వెండి గిన్నెలు రెండు 150 గ్రాములు, వెండి రెండు చెంచాలు రెండు 100 గ్రాములు,రూ.6300/ నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube