సూర్యాపేట జిల్లా:ఇంటర్ విద్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచుట,చదువుల్లో రానించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు పుష్పగుచ్చాలిచ్చి కళాశాలకు క్రమం తప్పకుండా రావాలని కోరారు.దీర్ఘకాలికంగా గైరాజరవుతున్న విద్యార్థుల కోసం అధ్యాపకులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి,వారిని కళాశాల రప్పించడానికి ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థుల చెంతకు వెళుతున్నట్లు ఈ సందర్భంగా సీనియర్ అధ్యాపకులు మద్ధిమడుగు సైదులు అన్నారు.
నేరేడుచర్ల కళాశాల అధ్యాపకులు గరిడేపల్లి,పొనుగోడు, అబ్బిరెడ్డిగూడెం తదితర గ్రామాలను సందర్శించి విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసి కళాశాలకు రోజు రావాల్సిందిగా కోరడం జరిగిందన్నారు.పేద,మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరారు.
ప్రతిరోజు విద్యార్థులు కళాశాలకు వస్తే విద్యపై మంచి పట్టు సాధించి ఉత్తమ ఫలితాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కర్ణాటీ శ్రీనివాస్,ఎం.
ప్రసాద్,ఎన్.నరసింహచారి,కె.
అపర్ణ తదితరులు పాల్గొన్నారు.