సూర్యాపేట జిల్లా: మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నేలమర్రి వినోద (24) అక్కడిక్కడే మృతి చెందగా,ట్రాక్టర్ డ్రైవర్, మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడడంతో వారిని కోదాడ ఆసుపత్రికి తరలించగా ధనమ్మ(50) కూడా మృతి చెందడంతో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది.ట్రాక్టర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
స్థానికులు తెలిపిన ప్రకారం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి 65 పై జిఎంఆర్ సంస్థలో మొక్కల సంరక్షణ నిమిత్తం రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వర్కర్స్,ట్రాక్టర్ నిలిపి డివైడర్ దగర పని చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ తో సహా పని చేస్తున్న కూలీలను ఢీ కొట్టడడంతో ప్రమాదం జరగింది.
ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కూలీలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని, తీవ్రంగా గాయపడ్డ వారికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.
నిత్యం రద్దీగా ఉంటూ ప్రమాదలకు నిలయంగా మారిన 65వ జాతీయ రహదారిపై పనిచేస్తున్న కూలీలకు రహదారి నిర్వహణ సంస్థ జిఎంఆర్ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని,సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించలేదని, అందుకే ప్రమాదం జరిగిందన్నారు.కేవలం రేడియం జాకెట్స్ తో సరిపెడుతూ జిఎంఆర్ సంస్థ కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం జిఎంఆర్ చర్యలు తీసుకోని,బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.