గురుకులాలా మృత్యు గృహలా...?

సూర్యాపేట జిల్లా: గురుకులాల్లో సంభవిస్తున్న విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ గురుకుల పాఠశాలలో మంగళవారం మరో విద్యా కుసుమం నేల రాలిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది.

 Gurukul Or Death House , Gurukul, Saraspati-TeluguStop.com

తల్లిదండ్రులు,తోటి విద్యార్థులు తెలిపిన వివరాలు ప్రకారం…సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి సోమయ్య,స్వరూప దంపతుల కుమార్తె సరస్పతి (10) దోసపహాడ్ మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో 5వ,తరగతి చదువుతుంది.బాలికకు జ్వరం వచ్చిందని మంగళవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందిన రెండు గంటల్లోపే మృతి చెందిందని తెలిసిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.జ్వరం వచ్చిన రెండు గంటల్లోనే ఎలా చనిపోయిందని,తమ కూతురు మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.

జ్వరం వచ్చిన విద్యార్థినికి సరైన వైద్యం అందించకుండా ఆర్ఎంపితో వైద్యం చేయించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్, జిఎన్ఎంలను సస్పెండ్ చేసి,విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్ది సంఘాల నాయకులు, తల్లిదండ్రులు,బంధువులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు పాఠశాల సిబ్బంది,ప్రిన్సిపాల్ పై దాడికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సూర్యాపేట డిఎస్పీ జి.రవి ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ శాంతింపజేశారు.అనంతరం విద్యార్ది సంఘాల నేతలు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో గురుకులాల్లో ఇప్పటికే 8 మంది విద్యార్దులు మరణించారని,గురుకులాలు విద్యాలయలా లేక మృత్యుగృహలా అని మండిపడ్డారు.చదువు కోసమని వచ్చిన ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థుల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు.

తరచూ గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని,ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు నేల రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సరస్వతి మృతి పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని,అసలు జ్వరంతో చనిపోయిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన బాధితులకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube