యాదాద్రి భువనగిరి జిల్లా: తన ఇంటి నంబరును మున్సిపల్ కమిషనర్ రద్దు చేయడంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భువనగిరి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే…భువనగిరి పట్టణానికి చెందిన ఫయాజ్ గత కొన్ని సంవత్సరాలుగా పహాడీ నగర్ లో నగర్ లో నివాసం ఉంటూ మెకానిక్ గా జీవిస్తున్నాడు.
తాను నివాసం ఉంటున్న ఇల్లు నోటరీ పద్ధతిలోనే ఉందని ఇంటి నెంబర్ ను మున్సిపల్ కమిషనర్ రద్దు చేశాడు.దీనితో భువనగిరి పట్టణంలో చాలా ఇల్లు నోటరీ పద్ధతిలోనే ఉన్నయని,తన ఇంటి నంబర్ ను మాత్రమే రద్దు చేయడం ఏంటని ఫయాజ్ మున్సిపల్ అధికారులకు, కమిషనర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేది లేక కుటుంబంతో సహా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్ ఛాంబర్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీనితో అక్కడ ఉన్న వారు అడ్డుకోవడం తో ప్రమాదం తప్పింది.
ఈ సందర్భంగా ఆ సంఘటనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై మున్సిపల్ చైర్మన్ దురుసుగా ప్రవర్తించారు.
చైర్మన్ తీరుతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం చైర్మన్ బాధితుడితో మాట్లడుతూ మీ సమస్య ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని,దానికి సంబంధించిన వివరాలు ఇస్తే పరిశీలించి,చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఫయాజ్ శాంతించారు.
ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ తనకు తన ఇల్లు తప్ప ఏ ఆధారం లేదని,ఎన్నిసార్లు కమిషనర్ కి విన్నవించుకున్నా పట్టించుకోలేదని,అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపారు.ఇప్పటికైనా తన సమస్య పరిష్కరించి,రద్దు చేసిన తన ఇంటి నంబర్ ను తిరిగి పునరుద్ధరించాలని వేడుకున్నాడు.