సూర్యాపేట జిల్లా: మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ 29,30,డిసెంబర్ 1 న జరిగే సిపిఎం జిల్లా తృతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ నవంబర్ 29న జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు.
ఈ బహిరంగ సభకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్,బీవీ రాఘవులు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,మల్లు లక్ష్మిలు హాజరవుతున్నారన్నారు.నవంబర్ 30,డిసెంబర్ 1 తేదీలలో 500 మంది ప్రతినిధులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో మహాసభలు జరుగుతాయని చెప్పారు.
ఈ మహాసభల విజయవంతానికై ప్రజలంతా హార్దికంగా, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు,చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, చిన్నపంగ నరసయ్య, మద్దెల జ్యోతి,సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు,సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్,సీనియర్ నాయకులు చెరుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.