సూర్యాపేట జిల్లా:గణేష్ శోభాయాత్ర జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గణేష్ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్ర మార్గాలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శోభాయాత్ర జరిగే మార్గాలు పొట్టి శ్రీరాములు సెంటర్,శంకర్ విలాస్ సెంటర్,పూల సెంటర్,కోర్టు చౌరస్తా,హెడ్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తా మొదలగు మార్గాలను తనిఖీ చేసి, మున్సిపల్ అలాగే సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లాలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాటు చేయాలని క్రెయిన్లు,గజ ఇతగాళ్లను,నిరంతర విద్యుత్,త్రాగునీరు ఏర్పాటు చేయాలని అలాగే నిరంతరం అన్ని ప్రాంతాలలో పోలీస్ విధులు నిర్వహించాలని,ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని తనిఖీ చేశారు.గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్స్,గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గణేష్ శోభాయాత్ర గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు గణేష్ ఉత్సవా కమిటీలు పోలీసు వారు సూచనలను అధికారుల సలహాలను పాటించాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపినారు.గణేష్ నవరాత్రులు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయనీ,అలాగే గణేష్ శోభాయాత్ర మరియు గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను ప్రజలు సంతోషకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఇందుకోసం జిల్లా పోలీస్ శాఖ 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత రక్షణ బందోబస్తు నిర్వహిస్తుందని ఎస్పీ తెలిపినారు.ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉత్సవం జరుపుకోవాలని కోరారు.
గణేష్ శోభాయాత్రకు సంబంధించి అన్ని మార్గాల్లో పటిష్టమైన నిగా ఉంటుందని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలు చేయిస్తామని తెలిపారు.జిల్లా కేంద్రం తోపాటు అన్ని మండలాలు గ్రామాలలో శోభాయాత్రకు సంబంధించి రూట్ మ్యాపింగ్ సెక్టార్లుగా విభజించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అత్యవసర సమయాల్లో 100 కు ఫోన్ చేయాలని అన్నారు.జిల్లా అధికారులు,ఇతర శాఖల సమన్వయంతో పని చేస్తామని అన్నారు.చెరువులు,కుంటలు,కాలువలు,నదులు అధిక నీటి ప్రవాహంతో ఉన్నాయని,నీటిలోకి ఎవరు దిగవద్దని ఎ విజ్ఞప్తి చేశారు.శోభాయాత్ర సమయంలో భక్తులు, ఉత్సవ కమిటీలు విద్యుత్ తీగలను గమనిస్తూ ముందుకు సాగాలన్నారు.
శోభాయాత్రకు వినియోగించే వాహనాలపై వృద్ధులను పిల్లలను ఎవరిని ఎక్కించవద్దని కోరారు.డీజేలను అనుమతించడం లేదని బాణాసంచాక కూడా అనుమతి లేదని తెలిపారు.
శోభయాత్ర సందర్భంగా ముఖ్యంగా యువత,విద్యార్థులు ఆదర్శంగా ఉండాలని, వివాదాలు,గొడవలు పెట్టుకోవద్దని శోభాయాత్ర సమయంలో ఒకరికొకరు పోటీ పడవద్దని విజ్ఞప్తి చేసినారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ రాజేంద్రకుమార్,డి.ఎస్.పి.నాగభూషణం,మున్సిపల్ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డి,ఉత్సవ కమిటీ ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.