సంఘాల బలోపేతం కోసం కార్మికులు ఐక్యంగా ఉండాలి: మేకల శ్రీనివాస్ రావు

సూర్యాపేట జిల్లా:కార్మిక చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని,వాటిని తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యంగా ఉండాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు( Mekala Srinivasa Rao ) అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్ లో ఏఐటియూసి ప్రాంతీయ అధ్యక్షుడు దంతాల రాంబాబు అధ్యక్షతన జరిగిన సంఘం ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎఐటియుసి సాధించిన 42 కార్మిక చట్టాలను నరేంద్రమోదీ ప్రభుత్వం సవరణల పేరుతో రద్దు చేసే ప్రయత్నం చేస్తుండగా సీఎం కేసీఆర్( CM KCR ) దాన్ని సమర్దిస్తున్నారన్నారు.

 Workers Should Be United To Strengthen Unions Mekala Srinivas Rao , Mekala Srini-TeluguStop.com

రెండవ సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆర్టీసి సమన్వయ కమిటీల గుర్తింపు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటే ఎన్నికల కొరకు హైకోర్టు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు.సింగరేణి కార్మికులకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కార్మికులను నిర్వీర్యం చేసి కార్మికుల పొట్ట కొట్టేందుకు కార్మిక చట్టాలను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.కార్పొరేట్ సంస్థలు,ఆదాని,అంబానీ సంస్థల బాగు కోసం కార్మిక చట్టాలను సవరణలు చేయడంతో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏఐటియూసి పోరాట ఫలితమే కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు.ఈ కార్యాక్రమంలో ఏఐటీయూసి గౌరవ అధ్యక్షులు చామల అశోక్ కుమార్,సీనియర్ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్,పట్టణ కార్యదర్శి బోర వెంకటేశ్వర్లు, నియోజవర్గ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్,దీకొండ శ్రీనివాస్,గాలి కృష్ణ,పెండ్ర కృష్ణ,రమేష్,తాళ్ల సైదులు, హరి,ఎడెల్లి శ్రీకాంత్, జానయ్య,గోపి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube