ఇటీవలే కాలం లో కష్టపడకుండా డబ్బులు సంపాదించడం కోసం చాలామంది అడ్డమైన దారులలో వెళ్లి ఎటువంటి దారుణలు చెయ్యడానికైనా వెనుకాడడం లేదు.కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు అమాయకులు కనిపిస్తే చాలు మోసం చేసేవారు చుట్టూ చేరి దొరికినంత సొమ్ము దోచేస్తున్నారు.
ఇలాంటి కోవలోనే ఓ యువతి పెళ్లి చేసుకుని డబ్బు, బంగారంతో( money , gold ) పారిపోయి మరో యువకుడితో పెళ్లి చేసుకుని అతన్ని కూడా మోసం చేసింది.ఇలా ఏకంగా నలుగురు యువకులను పెళ్లి చేసుకుని నట్టేట ముంచేసింది.
ఈ కిలాడీ లేడికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.
రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ( Ramagundam NTPC Annapurna ) కాలనీకి చెందిన ఓ యువకుడు రేవంత్( Revanth ) స్థానికంగా పాన్ షాప్ నిర్వహించుకుంటూ జీవనం సాగించేవాడు.రేవంత్ కు ఇది వరకే వివాహం అయ్యి విడాకులు అవడంతో ఒంటరిగా ఉన్నాడు.
అయితే రేవంత్ కు షాది డాట్ కామ్( shaadi dot com ) ద్వారా ఓ యువతి పరిచయం అయింది.ఒకరినొకరు పరిచయం పెంచుకున్న తర్వాత వీరి వ్యవహారం పెళ్లి దాకా వచ్చింది.
ఆ యువతి ఇదే తనకు మొదటి వివాహం అని రేవంత్ ను నమ్మించింది.

ఇద్దరి మనసులు కలవడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి కుదిరించారు.రామగుండం ఎన్టీపీసీ పరిధిలో ఉండే చిలుకలయ్య ఆలయంలో సాదాసీదాగా వివాహం చేసుకొని కొత్త కాపురం ప్రారంభించారు.ఆ యువతికి మద్యం, సిగరెట్ లాంటి అలవాట్లు ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి.
రేవంత్ ను తరచూ మందుకు, సిగరెట్లకు డబ్బులు ఇవ్వాలని వేధించేది.

ఆ తర్వాత సమయం చూసుకొని తన అక్క వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో ఉండే రూ.70 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయింది.అక్క ఇంటికి వెళ్లిన ఆ యువతి ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో యువకుడు ఆమె బంధువులు, మిత్రుల సహాయంతో ఆరా తీశాడు.
దీంతో ఆ యువతికి అప్పటికే మూడు వివాహాలు జరిగాయి అన్న విషయం బయటపడింది.ఆ యువతి చిరునామా తెలుసుకొని అక్కడికి వెళ్లి చూస్తే తన స్నేహితులతో ఆ యువతి విందు విలాసాలతో కనిపించింది.
ఆ యువతి తో పాటు ఆమె స్నేహితులు కూడా రేవంత్ పై దాడి చేసి అందుకు సంబంధించిన వీడియో కూడా తీశారు.తమకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతామని ఆ యువకుడిని బెదిరించారు.
ఆ యువకుడు రామగుండం ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన అన్యాయాన్ని తెలిపాడు.కేసులు ఆ యువతిపై చీటింగ్ కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.