మధుమేహం లేదా డయాబెటిస్.ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కొన్ని మిలియన్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో ముఖ్యంగా పురుషులు ఎక్కువగా ఉంటున్నారు.మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే.అది ప్రాణాంతకంగా మారిపోతుంది.అందుకే ఈ మధుమేహం బాధితులు ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
ఇక మధుమేహం ఉన్న వారు ఏం తినాలన్నా.ఎక్కడ బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయో అని భయపడిపోతారు.
ఈ క్రమంలోనే ఒక్కోసారి పొరపాటున షుగర్ లెవల్స్ అదుపు చేసే ఆహారలను కూడా దూరంగా పెడతారు.అలాంటి వాటిలో ఉసిరి కాయ ఒకటి.వాస్తవానికి ఉసిరి కాయ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.అందులోనూ ముఖ్యంగా మధుమేహం వ్యాధి గ్రస్తులు రెగ్యులర్‌గా ఉసిరి కాయ తీసుకుంటే.
అందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి మరియు క్రోమియం రక్తంలోని చక్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉంటాయి.ఉసిరి కాయతో జ్యూస్ తయారు చేసుకుని.
అందులో చిటికెడు పసుపు యాడ్ చేసి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది.

ఇక కేవలం మధుమేహాన్ని అదుపు చేయడమే కాదు.ఉసిరి కాయతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు.
ఉసిరి జ్యూస్ తీసుకుంటే సంతాన సమస్యలు దూరం అవుతాయి.అలాగే నోటి పుండ్లతో బాధ పడేవారు.
ఉసిరి రసంలో కొద్ది తేనే మిక్స్ చేసి.పుక్కలిస్తే త్వరగా పుండ్లు తగ్గిపోతాయి.
ఉసిరి జ్యూస్ ప్రతి రోజు తగిన మోతాదు తీసుకోవడం వల్ల.చర్మంపై వచ్చే మొటిమలు, మచ్చలు, ముడతలు క్రమంగా తగ్గిపోయి.యవ్వనంగా మారుతుంది.ఇక కంటి ఆరోగ్యం మెరుగు పరచడంలోనూ, శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ, రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ ఉసిరి అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి, ఉసిరిని తరచూ తీసుకుంటూ ఉండండి.