సూర్యాపేట జిల్లా: ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణ అంటూ తన ఆట పాటతో తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన ప్రజా గాయకుడు, వైఎస్ఆర్ టీపీ నాయకుడు ఏపూరి సోమన్న ఆదివారం హైదాబాద్ లోని తెలంగాణ భవన్ లో గులాబీ గూటికి చేరారు.ఆయనకు ఎమ్మెల్సీ మదుసూదనాచారీ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఇతర కవులు, కళాకారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపూరి సోమన్న మాట్లడుతూ తెలంగాణలో రూపాయికి పావలా వంతు మంది ప్రజలు కేసిఆర్ తో ఉన్నారని,
తెలంగాణ వచ్చే ముందే ఈ భవన్ కు దూరం అయ్యామని, నా ఇంటికి నేను వచ్చినట్లు ఉందన్నారు.ఎవరి పాలయింది అంటే బరాబర్ కేసిఆర్ పాలయ్యిందని,కేసిఆర్ పాలే కావాలని తెలిపారు.25 ఏళ్లు కష్టపడితే పెద్దల సరసన ఇప్పుడు కూర్చున్నానని,ఈ భవన్ మెట్లు ఎక్కానని చెప్పారు.తెలంగాణ ఉద్యమంలో నా భాగం ఉంది.బీఆర్ఎస్ కు కట్టుబడి పని చేస్తానని,మళ్ళీ కాలుకు గజ్జె కడుతా కేసిఆర్ పాట, ఆయన చేసిన అభివృద్ధి పాట పాడుతానని అన్నారు.
నేను తిరిగిన పార్టీలు అట్టర్ ఫ్లాప్ అవడంతో కేసిఆర్ దారిలో నడిచేందుకు వచ్చానని తెలిపారు.