అన్నదాతలను కలవర పెడుతున్న యాసంగి సీజన్...!

సూర్యాపేట జిల్లా :జిల్లాలో కరువు మండలంగా పేరున్న మోతె మండలంలో యాసంగి సీజన్ అన్నదాతల గుండెల్లో దడ పుట్టిస్తోంది.గత వర్షా కాలంలో అనుకున్న స్థాయిలో వర్షాలు పడక, నాన్ ఆయకట్టు ప్రాంతమైన మోతె మండల పరిధిలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.

 Yasangi Season Is Troubling The Farmers, Yasangi Season , Farmers, Suryapet Dist-TeluguStop.com

అయినా వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగం బోర్లు,బావులు,చెరువుల మీద ఆధారపడి యాసంగి సీజన్లో సాగులోకి దిగారు.కానీ,వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయి రోజు రోజుకు సాగునీటికి కటకట ఏర్పడింది.

ఈ ప్రాంతానికి వచ్చే ఎస్సారెస్పీ నీళ్లు కూడా సక్రమంగా రాకపోవడంతో వేసిన పంటలు చేతికి అందేనా అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు కాలువల సౌకర్యం ఉన్నప్పటికీ నీటి లభ్యత లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

ఇప్పటికే యాసంగిలో వరి పంట సాగు చాలా వరకు తగ్గింది.వేసిన కొద్దిపాటి పంటలకు నీళ్లు సరిపోక పెట్టిన పెట్టుబడి మందం పంట చేతికొస్తదో రాదోనని గుబులు చెందుతున్నారు.

వేసవి ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో తాగు నీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉందని,ప్రభుత్వం చొరవ తీసుకుని ఎస్సారెస్పీ జలాలతో చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు,బావుల ద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube