Varun Tej : ఫస్ట్ ఫేవరెట్ హీరోయిన్ లావణ్య.. సెకండ్ ఆ హీరోయిన్.. పవన్ తో సినిమా అప్పుడేనంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్( Varun Tej ) కు సోలో హీరోగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు.ఎంత కష్టపడుతున్నా వరుణ్ తేజ్ కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Varun Tej Comments About Lavanya Tripathi And Saipallavi Details Here Goes Vira-TeluguStop.com

మార్చి నెల 1వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ తో చిత్రయూనిట్ ముచ్చటించింది.

ఒక విద్యార్థి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడగగా నా ఫేవరెట్ హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నానని లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )గురించి చెప్పుకొచ్చారు.మంచి కథలు వస్తే లావణ్య త్రిపాఠితో కలిసి నటించడానికి సిద్ధమేనని కామెంట్లు చేశారు.లావణ్య కాకుండా ఎవరు ఫేవరెట్ అనే ప్రశ్నకు సాయిపల్లవి ( Sai Pallavi )పేరును వరుణ్ తేజ్ సమాధానంగా ఇవ్వడం జరిగింది.మంచి కథ దొరికితే పవన్ తో సినిమా చేస్తానని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్( Air Force Back Drop ) లో వస్తున్న తొలి మూవీ ఇదేనేమో అంటూ ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) గురించి వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.కామెడీలు వంద చేయవచ్చని అయితే దేశం కోసం ఏం చేసినా గొప్పగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.నా తర్వాత మూవీ మట్కా మాస్ మూవీగా తెరకెక్కుతోందని ఆయన అన్నారు.

గద్దలకొండ గణేష్ తరహాలో నా పాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.తర్వాత సినిమాలతో కూడా హీరో వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ హిట్లను అందుకుంటారేమో చూడాలి.వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.వరుణ్ తేజ్ సినిమాలు ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube