ఏడు సినిమాలు ఫ్లాప్..లక్ష్మి నరసింహ నుంచి సింహ వరకు ఏం జరిగింది ?

లక్ష్మీ నరసింహ సినిమా( Lakshmi Narasimha Movie ) విడుదల ఏ బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో అభిమానులకు పూనకాలు వచ్చాయి.

 Balayya Career Before Simha Movie Details, Balakrishna, Nandamuri Balakrishna, B-TeluguStop.com

ఈ సినిమా తర్వాత అదే అంచనాలతో థియేటర్స్ కి వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించాయి కొన్ని సినిమాలు.దాదాపు సింహ సినిమా( Simha Movie ) వరకు కూడా ఒక్క విజయాన్ని అందుకోలేక పోయాడు బాలకృష్ణ.

అంతలా లక్ష్మీ నరసింహ సినిమా తన ప్రభావాన్ని చూపించింది.ఈ సినిమా తర్వాత విజయేంద్ర వర్మ( Vijayendra Varma ) కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుంది అనుకున్న బాలయ్య బాబు అభిమానులకు థియేటర్లో మొదటి షో తో ఆ ఆశలు అడియాశలు అయ్యాయని అర్థమయ్యాయి.

Telugu Allari Pidugu, Balakrishna, Balayya, Lakshmi Simha, Pandurangadu, Simha-M

ఆ తర్వాత అల్లరి పిడుగు( Allari Pidugu ) అనే మరో పిడుగు లాంటి సినిమా వచ్చినా కూడా అది ఏమాత్రం బాలకృష్ణ స్థాయి సినిమా కాకపోవడం విశేషం.విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు సినిమాలు ఎలాగూ పోయాయి.ఆ తరువాత వచ్చిన మహారది సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఇది కూడా ప్లాప్ అయ్యింది.వరస మూడు పరాజయాల తర్వాత బాలకృష్ణ( Balakrishna ) పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ.

ఇక ఒక మగాడు సినిమా పోస్టర్స్, ట్రైలర్ విడుదలవడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అదే అంచనాలతో థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడు పూర్తిగా నిరాశతో వెనుదిరిగారు.

Telugu Allari Pidugu, Balakrishna, Balayya, Lakshmi Simha, Pandurangadu, Simha-M

ఇక ఆ తర్వాత ఎన్నో డివోషనల్ సినిమాలు తీసిన రాఘవేంద్రరావు సైతం పాండురంగడు( Pandurangadu ) అనే సినిమా తీశాడు బాలకృష్ణతో.ఆ సినిమా కూడా పరాజయం పాలయింది.రాజమౌళి శిష్యుడు మిత్రుడు అనే సినిమా కూడా బాలయ్య బాబుతో ప్లాన్ చేయగా అది కూడా ఎందుకో వర్కౌట్ కాలేదు.కథ బాగున్నప్పటికీ కథనం బాగో లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.

బాలయ్య బాబు పని అయిపోయిందని ఇండస్ట్రీ మొత్తం కోడై కూయడం మొదలుపెట్టింది.ఆ తర్వాత 2010లో బాలకృష్ణ నటించిన సింహా సినిమా విడుదలై సంచలన విజయం అందుకుంది.

అక్కడ మొదలైన బాలకృష్ణ ప్రపంచం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube