ఏడు సినిమాలు ఫ్లాప్..లక్ష్మి నరసింహ నుంచి సింహ వరకు ఏం జరిగింది ?

లక్ష్మీ నరసింహ సినిమా( Lakshmi Narasimha Movie ) విడుదల ఏ బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో అభిమానులకు పూనకాలు వచ్చాయి.ఈ సినిమా తర్వాత అదే అంచనాలతో థియేటర్స్ కి వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించాయి కొన్ని సినిమాలు.

దాదాపు సింహ సినిమా( Simha Movie ) వరకు కూడా ఒక్క విజయాన్ని అందుకోలేక పోయాడు బాలకృష్ణ.

అంతలా లక్ష్మీ నరసింహ సినిమా తన ప్రభావాన్ని చూపించింది.ఈ సినిమా తర్వాత విజయేంద్ర వర్మ( Vijayendra Varma ) కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుంది అనుకున్న బాలయ్య బాబు అభిమానులకు థియేటర్లో మొదటి షో తో ఆ ఆశలు అడియాశలు అయ్యాయని అర్థమయ్యాయి.

"""/" / ఆ తర్వాత అల్లరి పిడుగు( Allari Pidugu ) అనే మరో పిడుగు లాంటి సినిమా వచ్చినా కూడా అది ఏమాత్రం బాలకృష్ణ స్థాయి సినిమా కాకపోవడం విశేషం.

విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు సినిమాలు ఎలాగూ పోయాయి.ఆ తరువాత వచ్చిన మహారది సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఇది కూడా ప్లాప్ అయ్యింది.

వరస మూడు పరాజయాల తర్వాత బాలకృష్ణ( Balakrishna ) పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ.

ఇక ఒక మగాడు సినిమా పోస్టర్స్, ట్రైలర్ విడుదలవడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అదే అంచనాలతో థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడు పూర్తిగా నిరాశతో వెనుదిరిగారు. """/" / ఇక ఆ తర్వాత ఎన్నో డివోషనల్ సినిమాలు తీసిన రాఘవేంద్రరావు సైతం పాండురంగడు( Pandurangadu ) అనే సినిమా తీశాడు బాలకృష్ణతో.

ఆ సినిమా కూడా పరాజయం పాలయింది.రాజమౌళి శిష్యుడు మిత్రుడు అనే సినిమా కూడా బాలయ్య బాబుతో ప్లాన్ చేయగా అది కూడా ఎందుకో వర్కౌట్ కాలేదు.

కథ బాగున్నప్పటికీ కథనం బాగో లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.బాలయ్య బాబు పని అయిపోయిందని ఇండస్ట్రీ మొత్తం కోడై కూయడం మొదలుపెట్టింది.

ఆ తర్వాత 2010లో బాలకృష్ణ నటించిన సింహా సినిమా విడుదలై సంచలన విజయం అందుకుంది.

అక్కడ మొదలైన బాలకృష్ణ ప్రపంచం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

ముఖం మొత్తం మచ్చలేనా.. ఖరీదైన క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ మీకోసం!