సౌత్ సినిమా ఇండస్ట్రీ పై ప్రస్తుతం బాలీవుడ్ కన్ను పడింది.వారి ఇండస్ట్రీలో దొరకని విజయాలు సౌత్ ఇండస్ట్రీలో నటిస్తే ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతామని ఆలోచనతో ఇప్పటి హీరో హీరోయిన్స్ ఉన్నారు.
టాలీవుడ్ నిర్మాతలు సైతం తెలుగు హీరోలతోనే సినిమాలు తీయాలని తహతలాడుతున్నారు.అందరికన్నా ముందు అక్కడ హీరోయిన్స్ కి అవకాశాలకు దండిగా దొరుకుతున్నాయి ఇక్కడ.
ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ ఒకేసారి ఒకటికి మించి సినిమాలలో నటిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఒకటి పోయినా మరొకటి విజయం సాధిస్తే ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అని ఆలోచనలో సదరు హీరోయిన్స్ ఉన్నారు.
అలాంటి హీరోయిన్స్ లో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ముందు వరసలో ఉన్నారు వారిలో ఒకరు జాన్వి కపూర్( Janhvi Kapoor ) కాగా మరొకరు దిశా పటాని.జాన్వి కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో( Devara ) హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.ఈ సినిమాలో నటిస్తూనే మరోవైపు రామ్ చరణ్( Ram Charan ) నటిస్తున్న బుచ్చి బాబు సినిమాలో సైతం జాన్వీ కపూర్ నటిస్తుంది.ఈ ట్రిపుల్ ఆర్ హీరోల సినిమాల్లో జాన్వి నటిస్తూ ఒక్క సినిమా అయినా విజయం సాధిస్తే ఇక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటుంది.
ఇక రెండు సినిమాల్లో నటిస్తున్న మరో హీరోయిన్ దిశా పటాని.
ఈ అమ్మడు లోఫర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది పూరి జగన్నాథ్ దిశా పటాని( Disha Patani ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.అందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి( Kalki ) ఒక చిత్రం కావడం విశేషం.
అలాగే సూర్య హీరోగా నటిస్తున్న కంగువా( Kanguva ) చిత్రంలో సైతం దిశ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ రెండు సినిమాలు ప్యాన్ ఇండియా చిత్రాలే.ఈ రెండు చిత్రాలు కూడా విజయం సాధిస్తాయని గట్టిగా కలలు కంటుంది దిశా.మరి బాలీవుడ్ ని వదిలేసి సౌత్ ఇండియా వైపు దృష్టి సాధించిన ఈ హీరోయిన్స్ ఏమాత్రం విజయాలు అందుకుంటారు వేచి చూడాలి.