దేశానికి అన్నం పెట్టే రైతన్న తమకు సాగునీరు కోసం కాలువకు,లిఫ్ట్ ఇరిగేషన్, కరెంట్ కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం ఈ దేశంలో షరా మామూలే.కానీ,రైతుల వ్యవసాయ అవసరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన లిప్టులు తమకొద్దని రోడ్డెక్కిన విచిత్ర పరిస్థితి సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండల కేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది.
ఎక్కడైనా రైతులు లిఫ్ట్ ల కోసం పోరాటం చేస్తారు.కానీ,ఇక్కడ లిఫ్ట్ లు వద్దని పోరుబాట పట్టారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లడుతూ చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామ రైతులు గత కొంతకాలంగా లిఫ్టులు వద్దని ఉద్యమం చేపడుతున్నారని, అయినా స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు వారి ఆవేదనను పట్టించుకోవడం లేదని వాపోయారు.తాము కూడా ఇప్పటికీ రెండుసార్లు లిఫ్టుల వల్ల నష్టపోయామని,మళ్ళీ మూడోసారి లిఫ్ట్ పేరుతో నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం లిఫ్ట్ కాంట్రాక్టు లాభం కోసమే రైతులను బలిచేస్తున్నారని,అలాంటి రైతుకు ఉపయోగంలేని లిఫ్టులు తమకు అవరసం లేదని అన్నారు.