జీతాలు రాక వైద్య సిబ్బంది నిరసన

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రావడంలేదని హాస్పిటల్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ 3 నెలలు అయినా జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని,స్కూల్స్, కాలేజీలు మొదలు కావడంతో,పిల్లల ఫీజులు,ఇంటి అద్దెలు నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం అందినకాడికి అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.3 నెలలు జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురి అవుతున్నామని,అడిగితే పై సిబ్బంది సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మూడు నెలలకోసారి వచ్చే జీతాలు ఇప్పటికీ అందక పోవడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైనదన్నారు.వచ్చే జీతం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతాయా అన్నట్లుగా ఉందని వాపోతున్నారు.

 Medical Staff Protest Over Non-payment Of Salaries-TeluguStop.com

ఇళ్లలో పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉండటంతో ఇక భరించలేక నిరసన తెలియజేస్తున్నామని,దయచేసి తమకు జీతాలు మంజూరు చేసి కుటుంబాలను కాపాడాలని వేడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube