ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో హుజూర్ నగర్ మహిళ...!

సూర్యాపేట జిల్లా:ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని జౌన్‌ పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీకళా రెడ్డి పోటీ చేస్తున్నారు.ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్‌ సింగ్‌ మూడో భార్య.

 Huzur Nagar Woman In Uttar Pradesh Election Ring , Uttar Pradesh, Huzur Nagar Wo-TeluguStop.com

ధనుంజయ్‌ సింగ్‌కు కిడ్నాప్‌,అక్రమవసూళ్ల కేసులో శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.దీంతో తాజా ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్‌ ఇచ్చారు.

శ్రీకళారెడ్డి తండ్రి కె.జితేందర్‌ రెడ్డి నల్గొండ జిల్లా కో- ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పని చేశారు.తల్లి లలితారెడ్డి కూడా గ్రామ సర్పంచిగా సేవలందించారు.నిప్పో బ్యాటరీ గ్రూప్‌ కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే.శ్రీకళ రెడ్డి ఇంటర్మీడియట్‌ చెన్నైలో,బీకామ్‌ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేసి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు.అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు.

ధనుంజయ్‌సింగ్‌ మొదటి భార్య చనిపోవడం,రెండో భార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని 2017లో పారిస్‌లో వివాహమాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube