తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకం బతుకమ్మ

సూర్యాపేట జిల్లా:దేవుడిని పూజించేందుకు పూలను ఉపయోగిస్తామని అలాంటి పూలనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని డీఎస్పీ నాగభూషణం అన్నారు.ఆదివారం సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎనిమిదవ రోజు పోలీసులు కుటుంబ ఆడపడుచులతో నిర్వహించిన వెన్నముద్దల బతుకమ్మ ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 Bathukamma Is Special For Telangana State-TeluguStop.com

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి యేటా ఆడపడుచులు రకరకాల పూలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజించడం అభినందనీయమన్నారు.దేశ,విదేశాల్లో తెలంగాణ ఉనికిని చాటే బతుకమ్మ ఉత్సవాలను పోలీసులుకుటుంబ ఆడపడుచులతో నేడు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మహిళలు రేపు జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.మహిళా రక్షణకు జిల్లా పోలీసు ఎల్లవేళలా అందుబాటులో వుంటుందని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్,పట్టణ ఎస్సైలు క్రాంతికుమార్,శ్రీనివాస్,ఏఎస్ఐలు లవకుశ,శంకర్, మహిళా సిబ్బంది సునీత,బాలనాగమ్మ,సంధ్య, గురువమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube