తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకం బతుకమ్మ

తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకం బతుకమ్మ

సూర్యాపేట జిల్లా:దేవుడిని పూజించేందుకు పూలను ఉపయోగిస్తామని అలాంటి పూలనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని డీఎస్పీ నాగభూషణం అన్నారు.

తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకం బతుకమ్మ

ఆదివారం సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎనిమిదవ రోజు పోలీసులు కుటుంబ ఆడపడుచులతో నిర్వహించిన వెన్నముద్దల బతుకమ్మ ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకం బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి యేటా ఆడపడుచులు రకరకాల పూలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజించడం అభినందనీయమన్నారు.

దేశ,విదేశాల్లో తెలంగాణ ఉనికిని చాటే బతుకమ్మ ఉత్సవాలను పోలీసులుకుటుంబ ఆడపడుచులతో నేడు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మహిళలు రేపు జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.

మహిళా రక్షణకు జిల్లా పోలీసు ఎల్లవేళలా అందుబాటులో వుంటుందని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్,పట్టణ ఎస్సైలు క్రాంతికుమార్,శ్రీనివాస్,ఏఎస్ఐలు లవకుశ,శంకర్, మహిళా సిబ్బంది సునీత,బాలనాగమ్మ,సంధ్య, గురువమ్మ తదితరులు పాల్గొన్నారు.

స్పిరిట్ మూవీలో ప్రభాస్ నెగటివ్ రోల్ లో కనిపిస్తున్నారా..?

స్పిరిట్ మూవీలో ప్రభాస్ నెగటివ్ రోల్ లో కనిపిస్తున్నారా..?