ముగ్గురు గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్

సూర్యాపేట జిల్లా:పట్టణ పోలీసులు,జిల్లా సీసీఎస్ పోలీసు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంయుక్త రైడ్స్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి,వారి వద్ద నుండి 15 కేజీల గంజాయి, రెండు పల్సర్ బైక్స్ మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్,డిఎస్పీ మోహన్ కుమార్ లతో కలసి ఆయన వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ఏరియాలో డిఎస్పీ మోహన్ కుమార్ పర్యవేక్షణలో సిఐలు ఏ.అంజనేయులు,రవి అధ్వర్యంలో ఎస్ఐ పి.శ్రీనివాస్,సీసీఎస్ మరియు క్రైమ్ స్టాఫ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమనాస్పదంగా తిరుగుతూ కనిపించారు.వారు ఒక తెల్లటి బస్తా కలిగి ఉండడం,పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖి చేయగా గంజాయి లభ్యం కావడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారన్నారు.తదుపరి వారిని విచారించగా సీదారి ప్రభుదాస్ అనే వ్యక్తి గ్రామములో వ్యవసాయ పనులు చేస్తూ వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోక,అతని స్నేహితులు కొందరు వైజాగ్ జిల్లాలో అరకు ప్రాంతములో గంజాయి తక్కువ రేటుకి తీసుకవచ్చి,వైజాగ్,విజయవాడ మరియు రాజమండ్రి ప్రాంతాలలో ఎక్కువ రేటుకి అమ్ముతూ సులభముగా డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తూ ఉండటంతో అతను కూడా గత 05 ఏళ్ల నుండి వారితో పాటు అరకు వెళ్ళి,అక్కడ గంజాయి కేజీ రూ.1000/- చొప్పున కొనుగోలు చేసి దానిని వైజాగ్,విజయవాడ మరియు రాజమండ్రి ప్రాంతాలలో,రైల్వే స్టేషన్ లో కేజీ రూ.3000/-అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు నేరం అంగీకరించినట్లు తెలిపారు.గత 03 ఏళ్ల క్రితం విజయవాడలో గంజాయి అమ్ముతున్న సమయంలో సూర్యాపేట టౌన్ కి చెందిన కొల్లు సాయికిరణ్ మరియు కోలా మణికంఠ అనే వారు అతనికి పరిచయం అయ్యారని,వారు అప్పుడపుడు విజయవాడకు లేదా వైజాగ్ కు వారి బైక్ పై వెళ్ళి,అతని వద్ద,మరికొందరి వద్ద గంజాయిని కేజీ రూ.3000/-కొనుక్కొని,అట్టి గంజాయి వారి బైక్ పై సూర్యాపేటకుతీసుకొచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి,సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో,ఖమ్మం రైల్వే స్టేషన్ ఏరియాలలో ఎక్కువ ధరకు అమ్ముతుండేవారని తెలిసిందన్నారు.ఆ విధంగా సాయికిరణ్,మణికంఠ అప్పుడప్పుడు 10,15 కేజీలు లేదా 20 కేజీల గంజాయిని ఒకేసారి కేజీ రూ.3000/-అతని వద్ద కొనుక్కొని బైక్ పై వస్తుండేవారు.వారు అక్కడకు వెళ్లడానికి వీలు పడని సమయంలో ప్రభుదాస్ గంజాయిని అతని బైక్ పై సూర్యాపేటకు తీసుకవచ్చి ఇచ్చి వెళ్తుండేవాడు.

గురువారం ఉదయం సాయి కిరణ్,మణికంఠలు ఇద్దరు కలిసి ప్రభుదాస్ కు ఫోన్ చేసి,వారికి 15 కేజీల గంజాయి కావాలని,అట్టి గంజాయిని సూర్యాపేటకు తీసుకరమ్మని చెప్పగా,అతను 20 కేజీల గంజాయిని అరకు నుండి తీసుకొని అతని బైక్ పై బయలుదేరి విజయవాడకు వచ్చి,విజయవాడ రైల్వే స్టేషన్ లో 05 కేజీల గంజాయిని అమ్మి,రాత్రి విజయవాడలో ఉండి,శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ నుండి బైక్ నెంబర్ AP-31-EN-4394 గల పల్సర్ బైక్ పై బయలుదేరి,వారు అనుకున్న దాని ప్రకారం,సాయికిరణ్ మరియు మణికంఠ వారి బైక్ పై సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్దకు రాగా, ప్రభుదాస్ కూడా బస్టాండ్ వద్దకు వచ్చి అతని వద్ద ఉన్న 15 కేజీల గంజాయిని వారికి ఇస్తుండగా పోలీసు వారు పట్టుకున్నట్లు చెప్పారు.ఇట్టి కేసును ఛేదించిన పట్టణ సిఐ ఏ.అంజనేయులు,ఎస్ఐ పి.శ్రీనివాస్,సీసీఎస్ సి‌ఐ రవికుమార్,ఎస్‌ఐ నరేశ్ మరియు సీసీఎస్ సిబ్బందిని ఆయన అభినందించారు.

భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం : ఎమ్మెల్యే మందుల సామేల్

Latest Suryapet News